నారాయణఖేడ్: మండలంలోని అల్లాపూర్ శివారులోని ఖేడ్–కంగ్జి మార్గంలో గురువారం సాయంత్రం తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఖేడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మండల కేంద్రమైన పిట్లంకు చెందిన హుస్సేన్ (25) బైక్‌పై ఖేడ్‌కు వస్తున్నాడు. ఖేడ్ నుంచి కంగ్టి వెళ్తున్న తుఫాన్ అల్లాపూర్ సమీపంలో బైక్‌ను ఢీకొట్టగా.. హుస్సేన్ అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


