నాడు ఎమర్జెన్సీ విధించి స్వేచ్ఛను హరించారు | - | Sakshi
Sakshi News home page

నాడు ఎమర్జెన్సీ విధించి స్వేచ్ఛను హరించారు

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

మిరుదొడ్డి(దుబ్బాక): నాడు మాజీ దేశ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ వల్ల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని బీజేపీ మెదక్‌ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు విమర్శిచారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో గురువారం ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎమర్జెన్సీ డే సందర్భంగా ఇందిరా గాంధీపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీని విధించి దేశంలో స్వేచ్ఛను హరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు దేశంలో విధించిన ఎమర్జెన్సీ కారణంగా దేశ పౌరులందరూ స్వేచ్ఛను కోల్పోవడంతో పాటు, పత్రికా స్వేచ్ఛను హరిస్తూ నిరపరాదులను జైలు పాలు చేశారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ డే విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌, మల్లిఖార్జున ఖర్గేలు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్‌ పార్టీలాంటివి ఎన్ని పుట్టుకు వచ్చినా, ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరిని ఏమనకుండా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది ఒక్క బీజేపీ మాత్రమేనన్నారు. నాడు దేశంలో విధించిన ఎమర్జెన్సీని బ్లాక్‌ డేగా పరిగణిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మెదక్‌ ఎంపీ రఘుందన్‌ రావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement