హత్య కేసులను ఛేదించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులను ఛేదించిన పోలీసులు

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

రామాయంపేట(మెదక్‌)/తూప్రాన్‌: ఇటీవల జరిగిన రెండు హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌ వెల్లడించారు. చేగుంట మండలంలో మూడు రోజుల క్రితం జరిగిన యువకుడి హత్యకు సంబంధించి గురువారం తొమ్మిది మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్‌ (22), ఆటో డ్రైవర్‌ రణబోయిన ప్రభుకు మధ్య కొంత కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే శ్రీధర్‌ చిన్నాన్న కూతురైన శ్రావణిని ప్రభు ఇటీవల రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వారి మధ్య కక్ష పెరిగిపోగా, చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు సైతం నమోదయ్యాయి. ఈక్రమంలో శ్రీధర్‌ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై అనంతసాగర్‌ వెళ్తుండగా.. సమాచారం అందుకొని ఎనిమిది మందితో కలిసి రెండు ఆటోల్లో వచ్చిన ప్రభు ముందస్తూ పథకం ప్రకారం అనంతసాగర్‌ వద్ద వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టాడు. అక్కడే ఉన్న దిమ్మకు శ్రీధర్‌ తల తగిలి మృతిచెందాడు. ఈకేసును విచారించిన పోలీసులు నిందితుడు ప్రభుతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

12 మంది నిందితుల అరెస్ట్‌

వివరాలు వెల్లడించినడీఎస్పీ నరేందర్‌గౌడ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement