చిన్నారుల్లో క్రికెట్‌ క్రేజ్‌.. | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల్లో క్రికెట్‌ క్రేజ్‌..

May 17 2026 11:23 AM | Updated on May 17 2026 11:23 AM

సద్వినియోగం చేసుకోవాలి

క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో

నెలపాటు శిక్షణ

అండర్‌ –12 నుంచి ఓపెన్‌

సందడిగా స్టేడియం

మెలకువలు నేర్చుకుందాం.. ఫోర్లు, సిక్సర్లు కొడదాం

సిద్దిపేటజోన్‌: తెల్లవారుజాము నుంచే జిల్లా కేంద్రంలోని జయశంకర్‌ క్రికెట్‌ స్టేడియం సందడిగా మారుతుంది. హైదరాబాద్‌, సిద్దిపేట క్రికెట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా స్టేడియంలో క్రికెట్‌ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 11నుంచి జూన్‌ 11వరకు వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా ఆటలో మెలకువలు నేర్పించనున్నారు. అండర్‌ –12 నుంచి మొదలుకొని అండర్‌ –14, 16, 19, ఓపెన్‌ వరకు క్రికెట్‌లో శిక్షణనిస్తున్నారు. సుమారు 120మంది ప్రతి రోజు శిక్షణకు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, కీపింగ్‌ అంశాల్లో తర్ఫీదునిస్తుండగా, వీరిలో చిన్నారులతో పాటు యువతి,యువకులు కూడా ఉన్నారు. వేసవిలో విద్యాసంస్థలకు సెలవులు కావడంతో పెద్ద ఎత్తున క్రికెట్‌లో శిక్షణ పొందడానికి ఆసక్తి చూపుతుండటం గమనార్హం. నెట్‌ ప్రాక్టీసుతో పాటు మైదానంలో క్యాచ్‌లు పట్టడం, ఫీల్డింగ్‌ చేయడం లాంటి వాటిని క్షేత్ర స్థాయిలో కోచ్‌లు వివరిస్తున్నారు. నెలరోజుల పాటు కొనసాగనున్న శిక్షణకు ప్రత్యేకంగా ఐదుగురు కోచ్‌లను సిద్దిపేట క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు క్రికెట్‌ ఆటలో వివిధ అంశాల్లో శిక్షణ కొనసాగుతోంది.

నెట్‌ ప్రాక్టీసులో బ్యాటింగ్‌పై శిక్షణ

క్రికెట్‌ స్టేడియంలో హైదరాబాద్‌, సిద్దిపేట క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. నెలరోజుల పాటు జరిగే శిక్షణ తరగతులలో అన్ని అంశాలపై శిక్షణనిస్తాం. పిల్లలు చాలా ఆసక్తిగా వస్తున్నారు. మేము అంతే ఉత్సాహంతో వారికి శిక్షణనిస్తున్నాం. ఇప్పటికే 120 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

–విజయ్‌, క్రికెట్‌ కోచ్‌

కోచ్‌లు ఓపికగా నేర్పిస్తున్నారు..

క్రికెట్‌లో కోచింగ్‌ ఇవ్వడం వల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుంది. వేసవిలో టైం వెస్ట్‌ చేయకుండా శిక్షణకు వస్తున్న. ఆల్‌ రౌండర్‌గా క్రికెట్‌లో అన్నింటినీ నేర్చుకోవాలని ఆశ. చాలా సంతోషంగా ఉంది. క్రికెట్‌ కోచ్‌లు ఓపికగా అన్ని నేర్పిస్తున్నారు. –సాయి. సిద్దిపేట

వికెట్‌ కీపింగ్‌ ఇష్టం

నాకు బెస్ట్‌ వికెట్‌ కీపర్‌గా పేరు తెచ్చుకోవాలని కోరిక. రెండేళ్లుగా క్రికెట్‌ ఆడుతున్న. ప్రత్యేకంగా క్రికెట్‌ శిక్షణ ఉందని తెలుసుకొని వచ్చా. కీపింగ్‌లో టెక్నిక్స్‌ నేర్చుకుంటున్నా.

–ప్రేమ్‌, సిద్దిపేట.

మరింత నేర్చుకోవాలని..

క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. మంచి క్రికెట్‌ ప్లేయర్‌ కావాలని ఉంది. ఈ ఆటలో ఇంకా మెలకువలు నేర్చుకోవాలని ఉంది.అందుకే సెలవులు పక్కన పెట్టి రోజూ వస్తున్నా. బ్యాటింగ్‌ చేస్తుంటే ఎంతో ఉత్సాహం అనిపిస్తుంది

–చరణ్‌ దీప్‌, సిద్దిపేట.

Advertisement
 
Advertisement
Advertisement