ప్రారంభమైన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్‌ విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. ఫస్టియర్‌ విద్యార్థులకు ఉదయం జరిగిన పరీక్షకు 3,313మందికి గాను 3,120 మంది హాజరయ్యారు. సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 688 మంది విద్యార్థులకు గానూ 652 మంది హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. వివిధ స్క్వాడ్‌ బృందాలు ఉదయం 12 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయగా, మధ్యాహ్నం 10 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement