ఆరు కేంద్రాల్లో పరీక్షకు 1,897 మంది విద్యార్థులు హాజరు
సంగారెడ్డి టౌన్: జిల్లాలో పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్‌తోపాటు వ్యవసాయ కోర్సులో ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించారు. ఆరు పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన పరీక్షకు 2,068 మందికిగాను 1,897 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కో ఆర్డినేటర్ జానకీదేవి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.


