జహీరాబాద్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడే పరిస్థితి తీసుకురావద్దని ఎమ్మెల్యే మాణిక్‌రావు కేంద్రాల నిర్వాహకులకు స్పష్టం చేశారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తూకం వేశాక గోడౌన్‌కు తరలించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారనే విషయం తెలుసుకుని ఫోన్‌లో మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. రైతులు తీసుకొచ్చే ధాన్యం పెట్టుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, వర్షం వస్తే రైతుల పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఆరువేల బస్తాల మొక్కజొన్న ఉత్పత్తులు అలాగే ఉన్నాయని, వెంటనే రవాణా సౌకర్యం కల్పించి రైతుల ఇబ్బందులు తీర్చాలని సూచించారు. నిబంధనల పేరుతో పరిమితంగా కొనుగోళ్లు జరపడం వల్ల దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి, తిరిగి అఽధికారులతో కుమ్మకై ్క అధికధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు.
ఎమ్మెల్యే మాణిక్‌రావు


