చివరి గింజ వరకు కొంటాం | - | Sakshi
Sakshi News home page

చివరి గింజ వరకు కొంటాం

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

కల్హేర్‌(నారాయణఖేడ్‌): రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామని ఖేడ్‌ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి స్పష్టం చేశారు. సిర్గాపూర్‌ మండలం బోక్కస్‌గాం, అంతర్‌గాంలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించేందుకు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు.

విద్యా ప్రమాణాల పెంపునకు కృషి

నారాయణఖేడ్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యావారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement