ధాన్యం కొనుగోళ్లు వేగిరం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు వేగిరం

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

హత్నూర(సంగారెడ్డి): రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ సంగీత స్పష్టం చేశారు. హత్నూర మండలం చందాపూర్‌, దేవులపల్లి, హత్నూర, సిరిపుర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించిన అనంతరం పలు రైస్‌మిల్లులను సైతం సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తనివ్వద్దన్నారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైస్‌ మిల్లులకు వచ్చిన ధాన్యం లారీలను వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తేమశాతం పరిశీలించి తూకం వేయాలని ఆదేశించారు. మరో పక్షం రోజులైతే వర్షాలు పడే అవకాశముందని అప్పటిలోగా రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని సూచించారు.

అదనపు కలెక్టర్‌ సంగీత

Advertisement
 
Advertisement
Advertisement