చేగుంట(తూప్రాన్): గ్రామాల్లో నిర్వహించే బడిబాట షెడ్యూల్‌ను మార్చాలని తపస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. బుధవారం చేగుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మే 11 నుంచి జూన్ 9వరకు జనగణన కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని తెలిపారు. బడిబాట కార్యక్రమం సైతం మే 14 నుంచి జూన్ 19 వరకు చేయాలని నిర్ణయించారు. కాగా జనగణన కార్యక్రమంలో పాల్గొనే ఉపాధ్యాయులు బడిబాటలో పాల్గొనే అవకాశం లేనందున బడిబాట షెడ్యూల్‌ను ప్రభుత్వం పరిశీలించి మార్చాలని కోరారు. ఈ సమావేశంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, మండలశాఖ అధ్యక్షుడు వెంటేశ్, శివ్వంపేట మండల శాఖ అధ్యక్షుడు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


