చేతి రాతే భవిష్యత్తుకు బాట | - | Sakshi
Sakshi News home page

చేతి రాతే భవిష్యత్తుకు బాట

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

అల్లాదుర్గం(మెదక్‌): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏర్పాటు చేసిన సమ్మర్‌ క్యాంపులు సత్ఫాలితాలనిస్తున్నాయి. మండలంలోని ముస్లాపూర్‌ పీఎంశ్రీ జెడ్పీ పాఠశాలలో విద్యార్థుల కోసం సమ్మర్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ నెల 25 వరకు క్యాంపు కొనసాగుతుంది. ఇందులో విద్యార్థులు క్యారమ్స్‌, టేబుల్‌ టెన్నిస్‌, కబడ్డీ, కోకో ఆటలు ఆడుతున్నారు. చిత్ర లేఖనంలో ప్రావీణ్యం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ డ్రాయింగ్‌ టీచర్‌తో శిక్షణ ఇప్పిస్తున్నారు. సంగీతం, కుట్టు శిక్షణ, ఎంబ్రాయిడరీ సైతం విద్యార్థులు నేర్చుకుంటున్నారు. 15 రోజుల పాటు విద్యార్థులకు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హెచ్‌ఎం రమేశ్‌ తెలిపారు. అలాగే యోగా క్లాసులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మండలంలోని విద్యార్థులు సమ్మర్‌ క్యాంపులో పాల్గొనాలని ఆయన కోరారు.

సిద్దిపేటజోన్‌: సెలవుల్లో హిందీ, ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో మరింత పట్టు కోసం జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ప్రముఖ చేతిరాత నిపుణుడు ఎజాజ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో పది రోజుల పాటు శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మూడు భాషల్లో అందమైన చేతి రాతను మెరుగు పరిచేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. హిందీలో దోహలు, నీతి కథలు, తెలుగు పద్యాలు, డ్రాయింగ్‌, తెలుగు, హిందీ భాషల్లో దేశభక్తి గీతాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు అవసరమైన టిప్స్‌ గూర్చి మెలకువలు నేర్పుతున్నారు. సుమారు వందమంది విద్యార్థులు శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు.

హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ శాతవాహన ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులను బుధవారం స్టడీ టూర్‌కు లీసుకెళ్లినట్లు ప్రిన్సిపాల్‌ తిరుపతిరెడ్డి తెలిపారు. తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీ పట్టకుండా ప్రకృతి అందాలను చూడటానికి ఉమ్మాపూర్‌ మహాసముద్రానికి తీసుకెళ్లారు. అక్కడ నిర్మించే నూతన ఇంజనీరింగ్‌ భవనాలను, స్థలాలను పరిశీలించారు. అటవీ ప్రాంతంలోని కొండలు, ప్రకృతి అందాలను చూపించారు.

విద్యార్థులకు స్టడీ టూర్‌

చిన్నారులకు పలు అంశాల్లో శిక్షణ

Advertisement
 
Advertisement
Advertisement