భద్రత.. జరభద్రం | - | Sakshi
Sakshi News home page

భద్రత.. జరభద్రం

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

గేటెడ్‌ కమ్యూనిటీలు అపార్టుమెంట్ల యజమానులకు పోలీసుల అప్రమత్తం సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు గమనించండి ఏ ఆధారం లేనిదే ఎవ రినీ లోపలికి అనుమతించకూడదు కొత్తవారి కదలికలపై కన్నేయండి.. అనుమానం వస్తే సమాచారం ఇవ్వండి పోలీసుల అవగాహన కార్యక్రమాలు

లోపాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి

రామచంద్రాపురం (పటాన్‌చెరు): హైదరాబాద్‌ నగరంలో ఇటీవల చోటు చేసుకున్న ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి సతీమణి హత్య ఘటన తరువాత గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్స్‌, ప్రజల భద్రతపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా పటాన్‌చెరు అతిపెద్ద పారిశ్రామికవాడ కావడం, నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అనేక గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు ఏర్పాటయ్యాయి. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లు రావడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధుల భద్రతపై నిఘా పెంచేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

వృద్ధులే టార్గెట్‌..

ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా నివసించే వృద్ధులను లక్ష్యంగా చేసుకొని మోసాలు, దోపిడీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పలు కాలనీల్లో వృద్ధులు, ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా వారికి ధైర్యం కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు.

ఏజెన్సీల ద్వారానే నియామకం

ఇక ముందు కాలనీలో, అపార్ట్‌మెంట్‌లో పనిచేసే ప్రతి సిబ్బంది పూర్తి వివరాలు నమోదు చేయాలని కాలనీ అసోసియేషన్‌కు్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆధార్‌ కార్డ్‌, ఫోన్‌ నంబర్‌, వారి గ్రామంతో పాటు పూర్తి చిరునామా తప్పనిసరిగా సేకరించాలి. గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారానే గృహ సహాయకులు, డ్రైవర్‌లు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

సీసీ కెమెరాలపై దృష్టి

గేటెడ్‌ కమ్యూనిటీ, కాలనీల్లోని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని క్షేత్రస్థాయి లో పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల ని కాలనీ అసోసియేషన్‌లకు అధికారులు సూచిస్తున్నారు. భద్రతాపరమైన లోపాలు లేకుండా రాత్రి వేళలో సైతం విజిటర్‌ ఎంట్రీలో కచ్చితంగా వివరాలు నమోదు చేయాలని పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement