ధాన్యం తరలించాలని రైతుల రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తరలించాలని రైతుల రాస్తారోకో

May 15 2026 12:49 PM | Updated on May 15 2026 12:49 PM

చేగుంట(తూప్రాన్‌): కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యంను తరలించాలని మక్కరాజీపేట గ్రామంలో బుధవారం గజ్వేల్‌ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 25 రోజులు గడిచినా కేవలం రెండు లారీలఽ ధాన్యం మాత్రమే రైసుమిల్లులకు తరలించారని పేర్కొన్నారు. అధికారులు గ్రామానికి లారీలను పంపించి ధాన్యం తరలించేవరకు రాస్తారోకో విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకొని లారీలను తీసుకొచ్చి ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించారు. సాయంత్రం గ్రామానికి రెండు లారీలను పంపించి అధికారులు ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement