ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి
నారాయణఖేడ్: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తనివ్వద్దని ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి స్పష్టం చేశారు. ఖేడ్ మండలం సంజీవన్‌రావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన, రైసు మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. ఆమె వెంట స్థానిక డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ఆర్‌ఐ మాధవరెడ్డి ఉన్నారు.


