ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Mar 15 2026 6:47 AM | Updated on Mar 15 2026 6:47 AM

గజ్వేల్‌రూరల్‌: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం గజ్వేల్‌లో వెలుగుచూసింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని గిరిపల్లి గ్రామానికి చెందిన నెమటూరి చిన్నమల్లయ్య(41)కు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. చిన్న మల్లయ్య ఆర్‌ఎంపీ వైద్యునిగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయన ఆరు నెలల క్రితం కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో గజ్వేల్‌ పట్టణంలోని సత్యసాయి నగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉరివేసుకున్నాడు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా ఫ్యాన్‌ కొండికి చున్నీతో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

కుటుంబీకులతో గొడవపడి యువకుడు ..

హవేళిఘణాపూర్‌(మెదక్‌): యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని ముత్తాయికోట గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ప్రమోద్‌(26) హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. భార్యతో గొడవపడిన ప్రమోద్‌ శుక్రవారం స్వగ్రామం ముత్తాయికోటకు వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement