చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి

Mar 15 2026 6:47 AM | Updated on Mar 15 2026 6:47 AM

పెద్దశంకరంపేట(మెదక్‌): చేపల వేటకు వెళ్లిన జాలరి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిఽధిలోని జూకల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ.ప్రవీణ్‌రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బేస్త బేతయ్య రెండో కుమారుడు బేస్త లక్ష్మణ్‌(25) రోజు మాదిరిగానే చేపల వేట కోసం నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ పరిధిలోని ఎల్లమ్మరాళ్లపాయ ప్రాంతానికి తెప్పల సహాయంతో శుక్రవారం తన సోదరులు బేస్త సంగమేశ్వర్‌, బేస్త దత్తులతో కలిసి వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఈతగాళ్ల సహాయంతో వెతికినా ఫలితం లేదు. కాగా శనివారం నీటిలో అతడి మృతదేహం లభ్యమైంది. చేపల వేటకు ఉపయోగించే వల అతడికి చిక్కుకోవడంతో ఊపరాడక మృతి చెందినట్లు భావిస్తున్నారు.

విద్యుత్‌లైన్‌ మరమ్మతులు చేస్తుండగా..

గజ్వేల్‌రూరల్‌: విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మర్కూక్‌ మండలం చేబర్తి గ్రామానికి చెందిన నీరుడి బాబు(35) మీటర్‌ రీడర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం శ్రీగిరిపల్లిలో విద్యుత్‌ లైన్‌కు సంబంధించిన మరమ్మతులు చేస్తుండగా షాక్‌కు గురై గాయపడ్డాడు. స్థానికులు ప్రమాదస్థలం నుంచి గాయపడిన బాబును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని పేర్కొన్నారు. కాగా విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే గతంలో సైతం ఇలాంటి ఘటనే జరిగిందని స్థానికులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement