సంగారెడ్డి టౌన్ : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి వివరాల ప్రకారం... ఇస్మాయిల్ ఖాన్‌పేట గ్రామ శివారులోని నక్క వాగులో అనుమానాస్పదంగా వ్యక్తి (30) మృతి చెందాడు. వైట్‌షర్ట్, బ్లాక్ పాయింట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ గుర్తించినట్టయితే రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.
వ్యక్తి మృతికి కారణమైన
నిందితుడి అరెస్ట్
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతికి కారణమైన తమ్మారెడ్డి భూపాల్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో సీఐ వెంటరాజంగౌడ్, ఎస్‌ఐ సృజనతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 8న నార్సింగిలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చిన మేడ్చల్ జిల్లా అత్వెల్లికి చెందిన శ్యామ్ శ్యామ్‌సుందర్‌రెడ్డి ఉదయం స్నానం చేసి బట్టలు ఆరబెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. అతని భార్య భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. భవనంపై జే వైరుకు అక్రమంగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి వ్యక్తి మృతికి భూపాల్‌రెడ్డి కారణమైనట్లు విచారణలో తేలింది. దీంతో అతడ్ని రిమాండ్‌కు తరలించారు.


