దివ్యాంగులకు స్కూటీలు | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు స్కూటీలు

Mar 1 2026 8:40 AM | Updated on Mar 1 2026 8:40 AM

దివ్యాంగులకు స్కూటీలు

దివ్యాంగులకు స్కూటీలు

సంగారెడ్డి జోన్‌: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులోభాగంగానే అర్హులైన వారికి స్కూటీలను అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ట్రై సైకిల్‌, ల్యాప్‌ టాప్‌ తదితర పరికరాలను అందించింది. స్వయం ఉపాధి పొందుతున్న వారితో పాటు ఉన్నత చదువులు అభ్యసిస్తున్న వారికి ప్రాధాన్యం కల్పిస్తోంది.

ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ

అర్హులైన దివ్యాంగులు వాహనాలు పొందేందుకు ఇప్పటికే జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సదరం సర్టిఫికెట్‌ ఆధారంగా ఎక్కువశాతం వైకల్యం కలిగి ఉండి, వాహనం నడపగలిగి, డిగ్రీ, పీజీ చదువుకున్న వారితో పాటు స్వయం ఉపాధిలో రాణిస్తున్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మేకు 50 మందిని ఎంపిక చేశారు.

సైడ్‌ వీల్స్‌ బిగించి.. త్వరలో పంపిణీ

జిల్లాలో 14 వేలకు పైగా దివ్యాంగులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే స్కూటీలు ఇటీవలే కలెక్టరేట్‌కు చేరుకున్నాయి. ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాహనాలు నడుపుకునేందుకు సంబంధిత శాఖ ఆధ్వర్యంలో వాహనాలకు సైడ్‌ వీల్స్‌ బిగించనున్నారు. త్వరలో మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేయనున్నారు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రభుత్వానిదే

ఈ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చేయనుంది. సంబంధిత శాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి అందించనుంది. ఒక్కో వాహనం రూ.1,10,000 వరకు ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఎంపికై న వారికి పూర్తిస్థాయిలో ఉచితంగా పంపిణీ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement