అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర
సంగారెడ్డి టౌన్ : లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకునేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సూచించారు. మార్చి 28న నిర్వహించే లోక్ అదాలత్ కోసం జిల్లా కోర్టులో ఎస్పీ పరితోశ్ పంకజ్‌తో కలిసి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాజీమార్గంతో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పెద్ద మొత్తంలో నష్టపరిహారం కేసులను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, జిల్లా పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కవిత
రామచంద్రాపురం (పటాన్‌చెరు): బీహెచ్‌ఈఎల్ కాలనీలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమంలో శనివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకులు భార్గవ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చట్టాలపై
అవగాహన అవసరం
జహీరాబాద్ టౌన్: చదువుతోపాటు సాధారణ చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి.కవితాదేవి పేర్కొన్నారు. పట్టణ సమీపంలో గల మహీంద్ర అకాడమీలో శనివారం చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...బాలికలు, మహిళల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా కఠిన శిక్షణకు లోనవుతారన్నారు. మైనర్లు వాహనాలను నడపరాదని స్పష్టం చేశారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఇస్మాయిలప్ప, ఉపాధ్యాయులు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణ యాదవ్ మృతి
బాధాకరం
మాజీమంత్రి హరీశ్‌రావు
పటాన్‌చెరు టౌన్: మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సోదరుడు కృష్ణ యాదవ్ ఆకస్మిక మృతి బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కృష్ణ యాదవ్ భౌతికకాయాన్ని మాజీమంత్రి సందర్శించి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరై కృష్ణ యాదవ్‌కి నివాళులర్పించారు.
అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి
అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి
అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి


