98.03% హాజరు నమోదు | - | Sakshi
Sakshi News home page

98.03% హాజరు నమోదు

Feb 27 2026 10:50 AM | Updated on Feb 27 2026 10:50 AM

98.03% హాజరు నమోదు

98.03% హాజరు నమోదు

● ప్రారంభమైన సెకండ్‌ ఇంటర్‌ పరీక్షలు ● తొలి పరీక్షకు హాజరైన15,209 మంది విద్యార్థులు ● జిల్లాలో 306 మంది గైర్హాజరు

● ప్రారంభమైన సెకండ్‌ ఇంటర్‌ పరీక్షలు ● తొలి పరీక్షకు హాజరైన15,209 మంది విద్యార్థులు ● జిల్లాలో 306 మంది గైర్హాజరు

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: జిల్లాలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తొలిరోజు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 15,515 మంది విద్యార్థులకు గానూ 15,209 మంది విద్యార్థులు హాజరు కాగా హాజరు శాతం 98.03గా నమోదైంది. జిల్లాలో మొత్తంగా 306మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్‌ విభాగంలో 14,555 మంది విద్యార్థులకుగాను 14,296 మంది హాజరు కాగా 259 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 960మంది విద్యార్థులకు గానూ 913 మంది హాజరు కాగా 47 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు కాలేదని జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి గోవిందరాం తెలిపారు. డీఐఓ రెండు, డీఈసీ 11, హెచ్‌పీసీ సభ్యులు 05, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 14, సిట్టింగ్‌ స్క్వాడ్‌ 8 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఐఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement