ఆశ్రమాభివృద్ధికి కృషి చేస్తా | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమాభివృద్ధికి కృషి చేస్తా

Feb 27 2026 10:50 AM | Updated on Feb 27 2026 10:50 AM

ఆశ్రమాభివృద్ధికి కృషి చేస్తా

ఆశ్రమాభివృద్ధికి కృషి చేస్తా

● ఎమ్మెల్యే సునీతారెడ్డి ● ఓంకారేశ్వర ఆశ్రమంలో ప్రత్యేక పూజలు

● ఎమ్మెల్యే సునీతారెడ్డి ● ఓంకారేశ్వర ఆశ్రమంలో ప్రత్యేక పూజలు

హత్నూర(సంగారెడ్డి): మాతా మాణిక్యేశ్వరి ఓంకారేశ్వర ఆశ్రమాభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. హత్నూర మండలం సిరిపురం గ్రామ శివారులోని ఓంకారేశ్వర ఆశ్రమంలో వీరమ్మ మాతాజీ ఆరాధన ఉత్సవాల్లో గురువారం సునీతారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమంలో భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్ల కోసం తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. రెండురోజుల నుంచి ఆశ్రమంలో వీరమ్మ మాతాజీ ఆరాధనోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమాల్లో ఆశ్రమ పీఠాధిపతి దేవదాస్‌ స్వామి, వివిధ ఆశ్రమాల స్వామీజీలతోపాటు స్థానిక నాయకులు రామచంద్రారెడ్డి, నరేందర్‌, పాండుగౌడ్‌, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు. భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement