బస్సు ప్రయాణం.. భద్రత కనం
● కనిపించని ప్రథమ చికిత్స కిట్లు ● ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు
ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి 20–25 నిమిషాలు ఎంతో విలువైనవి. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడాలంటే ఆ సమయంలో అందించే చికిత్స ఎంతో కీలకం. ఇందుకోసం అన్ని వాహనాల్లో ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచుతారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇది తప్పనిసరి. కానీ, ఆర్టీసీ బస్సుల్లో మాత్రం వీటి నిర్వహణ అధ్వానంగా మారింది.
సంగారెడ్డి క్రైమ్: ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి..సురక్షితంగా గమ్యం చేరండి అంటూ ఆర్‌టీసీ అధికారులు చెబుతుంటారు. అది ఒకప్పటిమాట..ఇప్పడు బస్సెక్కితే తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుతామో లేదోనన్న గ్యారంటీ లేకుండా పోతోంది. ఇటీవల జిల్లాలో తరుచూ జరుగుతున్న ప్రమాదాలను చూస్తే ప్రయాణికుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పోనీ ప్రమాదం జరిగినప్పుడు ప్రథమ చికిత్స అందించేందుకు అవసరమైన కిట్ల జాడ బస్సుల్లో కానరాదు.మోటార్‌వాహనాల చట్టం ప్రకారం ఆర్‌టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స కచ్చితంగా ఉండాల్సిందే. జిల్లాలో తరచూ ఆర్టీసీ ప్రమాదాలు జరుగుతున్న అటు అధికారయంత్రాగం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆర్‌టీసీ బస్సులోని లోపాలు ప్రయాణికుల పాలిట శాపాలుగా మారుతున్నాయి.
మారుమూల గ్రామాలతోపాటు రహదారుల గుంతల ప్రమాదకరంగా తయారయ్యాయి. ఒకవైపు రహదారి పనులు మరోపక్క గుంతలున్న రోడ్లపై వెళ్లే సర్వీసులు ఎక్కడో ఒకచోట ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం బస్సుల్లో సిట్టింగ్ సామర్థ్యానికి మించి సుమారు 50 నుంచి 65 మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. బస్సులు అదుపు తప్పినా, ప్రమాదం జరిగి ఎవరైనా గాయపడినా ప్రథమ చికిత్స చేయాల్సి వస్తోంది.
ఈ డిపోల పరిధిలో నిత్యం రోజువారీ దాదాపు 1000–2,500 పైగామంది ప్రయాణం చేస్తుంటారు. మహాలక్ష్మి పథకం అమలవుతున్నప్పటి నుంచి బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు బస్సులు లేకపోవడం, ఏదైనా ప్రమాదం జరిగితే అందుబాటులో ఉండాల్సిన ప్రథమ చికిత్స కిట్లు లేకపోవడం శోచనీయం.
ఉమ్మడి మెదక్‌వ్యాప్తంగా ఆర్‌టీసీ బస్సులో మూడేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలు
ఉమ్మడి మెదక్ రోడ్డు ప్రమాదాలు మొత్తం మరణించిన వారు క్షత్రగాత్రులు
(సంవత్సరం)
2023–2024 29 35 40
2024–2025 17 18 23
2025–2026 21 21 16
(జనవరి వరకు)
ఉమ్మడి మెదక్ డిపో పరిధిలో బస్సు వివరాలు
ఉమ్మడి మెదక్ డిపో పరిధిలో 420 సంస్థలు ఉండగా 213 ప్రైవేట్ బస్సులున్నాయి. మొత్తం 633 బస్సులున్నాయి.
డిపో ప్రభుత్వ బస్సులు ప్రైవేట్
సంగారెడ్డి 87 18
నారాయణఖేడ్ 59 13
జహీరాబాద్ 63 21
మెదక్ 62 104
నర్సాపూర్ 29 03
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 49 28
దుబ్బాక 28 08
బస్సు ప్రయాణం.. భద్రత కనం


