భూమి రీ సర్వేకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

భూమి రీ సర్వేకు సహకరించాలి

Feb 23 2026 9:18 AM | Updated on Feb 23 2026 9:18 AM

భూమి రీ సర్వేకు సహకరించాలి

భూమి రీ సర్వేకు సహకరించాలి

జాయింట్‌ కలెక్టర్‌ మాధురి

జాయింట్‌ కలెక్టర్‌ మాధురి

రాయికోడ్‌(అందోల్‌): భూమి రీ సర్వేకు ప్రతీ ఒకరు సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ మాధురి పేర్కొన్నారు. మండలంలోని ముస్తాఫపూర్‌ గ్రామంలో భూ రీసర్వేపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వేతో రైతులకు ఉండే భూ హద్దు సమస్యలు దూరమవుతాయన్నారు. భూ సరిహద్దుల కారణంగానే గ్రామాల్లో ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటున్నాయన్నారు. భూ రీ సర్వే చేసే క్రమంలో స్థానిక అధికారులు ఎలాంటి తప్పిదాలు చేసినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వచ్చే ఫిర్యాదు లను పరిశీలించి బాధ్యలపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామానికి చెందిన రైతులు భీంరాజ్‌, స్వరూపమ్మలు తమ భూ సర్వే సమస్యలు, పొలాలకు వెళ్లేందుకు దారి లేని సమస్యలను జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. భూ రీ సర్వేలో రైతులు, రైతు కూలీల భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, డీటీ నరేశ్‌, ఆర్‌ఐ శ్రీకాంత్‌, సర్వేయర్‌ సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు, నాయకులు నవనీత, మొగులయ్య, విష్ణవర్ధన్‌రెడ్డి, మహంకాళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement