లక్డారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లక్డారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. లక్డారం గ్రామంలో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఎన్నికల్లో గెలుపోటములు అత్యంత సహజమని..అంతిమంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అతి త్వరలోనే గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికై న ఇస్నాపూర్ మున్సిపల్ పాలకమండలి సభ్యులను ఘనంగా సన్మానించారు. సమావేశంలో పటాన్‌చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుమలత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు శంకర్‌గౌడ్, రాములుగౌడ్, మోటె కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
గృహనిర్బంధం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి ఇంటిపై జరిగిన దాడి విషయంలో ఆయనను పరామర్శించేందుకు బయలుదేరిన ఎమ్మెల్సీ అంజిరెడ్డిని రామచంద్రాపురం ఇన్‌స్పెక్టర్ జగన్నాథ్ ఆధ్వర్యంలో ఆదివారం హౌస్‌అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకే భద్రత ఇవ్వలేకపోతే సామాన్య ప్రజలకు ఎలా భద్రత కల్పిస్తుందని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు.
ప్రవేశ పరీక్ష.. ప్రశాంతం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: గురుకుల పాఠశాలలో 5వ తరగతితోపాటు 6,7,8,9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షను రాసేందుకు జిల్లావ్యాప్తంగా 8,598 మంది విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు జిల్లావ్యాప్తంగా 23 కేంద్రాలను కేటాయించారు. పరీక్ష రాసేందుకు విద్యార్థులు తమ తల్లిదండ్రులను తీసుకుని 10 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అనంతరం ఒక గంట ముందుగానే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 8,598 మంది విద్యార్థులకు గానూ 8,086 మంది విద్యార్థులు హాజరు కాగా 512 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీసీఓ కల్పన తెలిపారు.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడులు సరికాదు
కొత్త బస్టాండ్ వద్ద బీజేపీ నిరసన
సంగారెడ్డి: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి నిరసిస్తూ స్థానిక కొత్త బస్టాండ్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. కామారెడ్డి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్రమ అరెస్టు, బాన్సువాడలో మహిళపై దాడి చేయడానికి నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి, పోచారం రాములు, మందుల నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
లక్డారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం
లక్డారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం


