వీబీజీరామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలి
కొండాపూర్(సంగారెడ్డి): ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసే వీబీజీరామ్‌జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మాణిక్యం డిమాండ్ చేశారు. మండల పరిధిలోని సీతారాంకుంటతాండలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను సీపీఎం బృందం గురువారం కలసి కొద్దిసేపు ఉపాధి పనులు చేశారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ...కార్మిక, రైతు, కూలీలకు ప్రజా వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి వీబీజీరామ్‌జీ పథకాన్ని తెచ్చి రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపిందని మండిపడ్డారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో మోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు.
కలసివచ్చే శక్తులతో ముందుకు: మల్లేశం
ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎర్రజెండా బిడ్డలను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బీరం మల్లేశం కోరారు. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ అభ్యర్థితో కలిసి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ లౌకికవాద, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో సీపీఎం కొండాపూర్ మండల కార్యదర్శి రాజయ్య మండల కమిటీ సభ్యులు బాబురావు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి అర్జున్‌్ ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం


