జోరందుకున్న నామినేషన్లు
● పోటా పోటీగా దాఖలు
● రెండోరోజు 719 నామినేషన్లు
● నేటితో ముగియనున్న గడువు
సంగారెడ్డి జోన్: జిల్లాలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. గురువారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 719 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం ఈ రెండురోజుల్లోనూ 818 నామినేషన్లను దాఖలయ్యాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేశారు. ఆలయాలు, ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక పూజలు చేసి మద్దతుదారులతో ర్యాలీగా కేంద్రాలకు తరలివచ్చారు. ఇప్పటివరకు కాంగ్రెస్ 299, బీఆర్‌ఎస్ 247, బీజేపీ 149, బీఎస్‌పీ 4, ఆప్ 1, సీపీఎం 2, ఎంఐఎం 9, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 5, స్వతంత్రంగా 102 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.


