సీఎం కప్ విజేతలకు బహుమతులు
టేక్మాల్(మెదక్): ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ పోటీలలోని విజేతలకు బుధవారం టేక్మాల్‌లో ఎంఈఓ సుజాత అందించారు. కబడ్డీ పోటీలలో టేక్మాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మొదటి బహుమతి, రెండో బహుమతి ఎలకుర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందించారు. ఇందులో సర్పంచ్ తిమ్మిగారి సుదాకర్, ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మరమేష్, పీడీ మధు తదితరులు ఉన్నారు.
సీఎం కప్ క్రీడాపోటీల వేదిక మార్పు
గజ్వేల్‌రూరల్: ఈనెల 29, 30వ తేదీల్లో రెండురోజుల పాటు నిర్వహించ తలపెట్టిన సీఎం కప్ 2026 క్రీడా పోటీలను మండల పరిధిలోని బయ్యారంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రవీణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల స్థాయిలో కబడ్డీ, ఖోఖో, చెస్, వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహిస్తామన్నారు. 2008 జనవరి ఒకటి తర్వాత జన్మించిన వారు మాత్రమే ఈ క్రీడాపోటీలకు అర్హులన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన ఫారంతో పాటు ఆధార్‌కార్డు జీరాక్స్ తీసుకొని గురువారం ఉదయం 9గంటలలోగా హాజరు కావాలని సూచించారు.


