విద్యుదాఘాతానికి రైతు
కొల్చారం(నర్సాపూర్): విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వసురాం గిరిజన తండాలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్ మైనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మలావత్ శ్రీను (44) గతేడాది నుంచి అంసాన్‌పల్లికి చెందిన సాయవ్వోల్ల ఎగొండకు చెందిన భూమిని కౌలుకు తీసుకున్నాడు. బోరు పనిచేయడం లేదంటూ ఉదయం ఇంటి నుంచి పొలానికి వెళ్లాడు. సాయంత్రం అటుగా వెళ్లిన వ్యక్తికి బోరు స్టార్టర్ వద్ద నిర్జీవంగా పడి ఉన్న శ్రీను కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించి ఉండవచ్చని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


