కుటుంబ పోషణ భారమై వ్యక్తి అదృశ్యం
సంగారెడ్డి క్రైమ్: ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... ఝరాసంఘం మండలంలోని చిలకపల్లి గ్రామానికి చెందిన వడ్ల శంకర్ (36) బతుకుదెరువు నిమిత్తం 8 ఏళ్లుగా పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో భార్య గాయత్రి(32)తో కలిసి వడ్ల పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి పాప ఉంది. దంపతుల మధ్య గొడవలు అధికం అవడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు ఇరువురిని మందలించారు. కుటుంబ పోషణ భారమై అదే ఆవేశంలో మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.
మతిస్థిమితం లేని మహిళ..
జహీరాబాద్ టౌన్: మహిళ అదృశ్యమైంది. చిరాగ్‌పల్లి ఎస్‌ఐ.రాజేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బూచినెల్లి గ్రామానికి చెందిన సత్వార్ ఖదీర్ కూతురు నస్రీన్‌కు మతిస్థితిమితం లేదు. ఈ నెల 19న ఇంట్లో ఎవరు లేని సమయంలో సాయంత్రం 4 గంటలకు బయటకు వెళ్లింది. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల వద్ద వెతికినా ఫలితం లేదు. గతంలో రెండు సార్లు ఇలాగే ఇంటి నుంచి వెళ్తే.. క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.
కుటుంబ పోషణ భారమై వ్యక్తి అదృశ్యం


