నిబంధనలు బేఖాతర్
నంబర్ ప్లేట్ లేని వాహనాలపై చర్యలేవీ?
సంగారెడ్డి క్రైమ్: జిల్లా హెడ్ క్వార్డర్స్‌లో నంబర్ ప్లేట్ లేని భారీ వాహనాలు ప్రధాన రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. వాహనాలకు నంబర్ ప్లేట్ తప్పనిసరి వంటి నిబంధనలున్నా పట్టణంలో ఇవేవి పాటించకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారు. హెడ్ క్వార్డర్స్‌లో రోజు రోజుకు ప్రమాదాలు జరుగుతున్నా.. పోలీస్ సిబ్బంది మాత్రం తమకేమి పట్టనట్టు వ్వవహరిస్తున్నారని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది వాహనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు ప్రధాన రోడ్లపై తిరిగే భారీ వాహనాలకు నంబర్ ప్లేట్లు ఉండేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.


