జాతీయ పోటీలకు క్రీడాకారులు
మిరుదొడ్డి(దుబ్బాక): జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్‌కు ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులు ఎంపికై నట్లు మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరయ్య, జనరల్ సెక్రెటరీ పీవీ రమణ తెలిపారు. ఇటీవల ఆర్మూర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించారు. మెదక్ జిల్లా బాలికల జట్టు నుంచి నిహారిక, రాధిక, గాయత్రి, బాలుర జట్టు నుంచి భరత్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి, ఫిబ్రవరి ఒకటి వరకు తమిళనాడులో జరిగే బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నీలో పాల్గొంటారని తెలిపారు.


