సమస్యలకు వాట్సప్‌తో పరిష్కారం
హుస్నాబాద్‌రూరల్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. మండలంలోని పందిల్ల గ్రామం సర్పంచ్ తోడేటి రమేశ్ సమస్యల పరిష్కారం కోసం అధికారులు, గ్రామస్తులతో కలిపి ‘పందిల్ల వాట్సప్’ గ్రూపును ఏర్పాటు చేశాడు. మంగళవారం ఒక రైతు ఎస్‌ఎస్ –1 ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర విద్యుత్ స్తంభం పడిపోతుండటంతో గ్రామానికి సరఫరా నిలిచిపోతుందని వాట్సప్ గ్రూపులో పోస్టు చేశాడు. దీంతో సాయంత్రం విద్యుత్ అధికారులు వచ్చి పడిపోతున్న విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టారు. పలుమార్లు చెప్పినా స్పందించని అధికారులు వాట్సప్ గ్రూపులో పోస్టు చేయగానే స్తంభం సరిచేయడంతో రైతులు ఆశ్చర్యపోతున్నారు.
సమస్యలకు వాట్సప్‌తో పరిష్కారం


