అక్రమంగా మద్యం విక్రయాలు
నంగునూరు(సిద్దిపేట): అక్రమ మద్యం అమ్మకాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో వైన్స్ నిర్వాహకులకు వరంగా మారింది. అమ్మకాలను పెంచే లక్ష్యంతో ఊరూరా బెల్ట్‌షాపులను ప్రోత్సహిస్తూనే కొన్ని సెంటర్లలో మద్యాన్ని నిల్వ చేసి హోల్‌సేల్, రిటైల్ ధరలకు విక్రయిస్తున్నారు. నేషనల్ హైవేను ఆనుకొని ఓ ఇంట్లో యథేచ్ఛగా అమ్మకాలు చేస్తున్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు బెల్ట్‌షాపుల నిర్వాహకులను పోలీసులు బైండోవర్ చేయడంతో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. అలాగే గతంలో ఉన్న వైన్స్ దుకాణాల కాల పరిమితి ముగిసి పోగా డిసెంబర్‌లో కొత్త వారు రావడంతో తిరిగి ఊరూరా బెల్ట్‌షాపులు వెలిశాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని మూడు మద్యం షాపుల యజమానులు ఏకమై బెల్ట్‌షాపుల ద్వారా అధిక ధరలకు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
చోద్యం చూస్తున్న అధికారులు
హైవే పక్కనే హోల్‌సేల్ దుకాణం
వైన్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యం
160 మందిని బైండోవర్
చేసినా మళ్లీ అమ్మకాలు!


