
గణేశ్ లైటింగ్.. ట్రెండింగ్
వినాయక మండపాల వద్ద ఏర్పాటు ప్రారంభమైన చవితి స్వాగత ఉత్సవాలు ఈసారి వెయ్యికి పైగా గణేశ్ మండపాలు
దుబ్బాకలో యూత్ పేరుతో బోర్డులు
దుబ్బాక టౌన్: దుబ్బాక మండల వ్యాప్తంగా ఈ సారి వెయ్యికి పైగా వినాయక మండపాలు ఏర్పాటు చేయనున్నారు. పోలీసులు సైతం వినాయకుల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలని అవగాహన కల్పించారు.
సోషల్ మీడియాలో వైరల్
యూత్ పేరును సినిమా పేరు తలపించేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను జత చేసి సోషల్ మీడియాలో వదులున్నారు. దీంతో ఆ వీడియోలు ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ఘనంగా స్వాగత ఉత్సవాలు
వినాయక చవితి మూడు రోజుల మందే దుబ్బాకలో స్వాగత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భారీ గణనాథులకు పుర వీధుల గుండా డీజే సౌండ్‌లతో, యువకుల డాన్స్‌లతో స్వాగతం పలుకుతున్నారు. ముందే ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఊరేగింపును తిలకించడానికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు.
ఏయ్ బిడ్డా ఇది మా అడ్డా అంటున్నారు..దుబ్బాక మండల వినాయక మండపాల యూత్ సభ్యులు. జిల్లాలో చవితి ఉత్సవాల్లో ఏళ్ల నుంచి దుబ్బాక ప్రత్యేకతను సంతరించుకుంటూ వస్తోంది. వినూత్నంగా లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేసి, యూత్ పేరును సినిమాను తలపించేలా తీర్చిదిద్ది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి.

గణేశ్ లైటింగ్.. ట్రెండింగ్