
చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి
ఎమ్మెల్యే సునీతా రెడ్డి
నర్సాపూర్ రూరల్: రత్నాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం చుంచెలుక పడిన నీరు తాగడంతో చిన్నారులు అస్వస్థతకు గురై నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న విషయం విధితమే. కాగా ఆదివారం ఎమ్మెల్యే సునీతా రెడ్డి అస్వస్థతకు గురైన పిల్లలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ నాయకులు మన్సూర్, శివకుమార్, భోగ శేఖర్, పంబల భిక్షపతి, రమణ ఉన్నారు. కాగా చిన్నారులను డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి రాజిరెడ్డి పరామర్శించారు. అలాగే పిల్లలకు అందుతున్న వైద్యంపై ఆర్‌జేడీ ఝాన్సీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను పరామర్శించిన వారిలో డీడబ్ల్యూఓ హైమావతి, ఈడీపీఓ హేమ భార్గవి, సూపర్ వేజర్ సంతోష ఉన్నారు.