
సమస్యలకు భక్తి మార్గమే పరిష్కారం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు భక్తి మార్గమే పరిష్కారమని రామకృష్ణ మఠం స్వామీజీ తత్పదానంద మహరాజ్, ప్రతినిధి సూర్య ప్రకాశ్ పేర్కొన్నారు. శ్రీరామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని అన్నపూర్ణేశ్వరి ఆలయ ఆవరణలో సత్సంగం ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదా దేవిల జీవితం, బోధనలు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో శ్రీరామకృష్ణ సేవాసమితి జిల్లా అధ్యక్షుడు నాగేందర్, కార్యదర్శి రాజేశ్వర్‌రావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.