మొక్కజొన్నపై అడవి పందుల దాడి | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్నపై అడవి పందుల దాడి

Aug 25 2025 9:02 AM | Updated on Aug 25 2025 9:02 AM

మొక్క

మొక్కజొన్నపై అడవి పందుల దాడి

నిజాంపేట(మెదక్‌): మొక్కజొన్న పంటపై అడవి పందులు దాడి చేశాయి. వివరాలు ఇలా... మండల పరిధిలోని చల్మెడ గ్రామానికి చెందిన పెద్దబోయిన స్వామి తనకున్న ఒక ఎకరాలో మొక్కజొన్న సాగు చేశాడు. ప్రస్తుతం పంట కంకి దశలో ఉంది. బయటకు వచ్చిన కంకులను అడవి పందులు దాడి చేశాయి. అడవి జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి రైతు చేను చుట్టూ వల, చీరలు కట్టి.. రాత్రిఫూట కాపలా ఉన్నా కూడా అవి పంటపై దాడి చేస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చే శాడు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

అంతర్‌ జిల్లా దొంగ అరెస్టు

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): అంతర్‌ జిల్లా దొంగను పోలీసులు అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ కృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. మండలంలోని పీర్లపల్లిలో జరిగిన దొంగతనాల కేసు దర్యాప్తు చేస్తుండగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాహుల్‌ దొంగతనం చేసినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. జిల్లాలో రెండు దొంగతనాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐదు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు రాహుల్‌ జులాయిగా తిరుగుతూ పాత సామాన్లు ఏరుకుని జీవించేవాడు. జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడేవాడని తెలిపారు. అతడి వద్ద నుంచి ఫోన్‌, బైక్‌, అల్యూమినియం సామాన్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిని గజ్వేల్‌ కోర్టులో హాజరు పరిచారు.

ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం

ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి

గజ్వేల్‌: ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి పేర్కొ న్నారు. ఆదివారం మండలంలోని కోమటిబండ గ్రామంలోని పాండవ కృష్ణ ధ్యాన క్షేత్రంలో హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధ్యానంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్న ధ్యాన క్షేత్రం కృషి అభినందనీయమన్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాల ను సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో ‘ఆపన్న హస్తం’ సంస్థ అధ్యక్షుడు బాలచంద్రం, సూర్యనమస్కార బృందం అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి, పిరమిడ్‌ స్పిరిచువల్‌ సొసైటీ అధ్యక్షుడు నర్సింలు పాల్గొన్నారు.

ర్యాగింగ్‌కు పాల్పడితే

కఠిన చర్యలు: సిద్దిపేట సీపీ

సిద్దిపేటకమాన్‌: విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్‌ లాంటి వికృత చేష్టలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటా మని సీపీ అనురాధ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ర్యాగింగ్‌ మన సంస్కృతి కాదని, ఇలాంటి విష సంస్కృతికి ఎవరూ పాల్పడవద్దన్నారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ నియంత్రణకు యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాగింగ్‌ వల్ల విద్యార్థుల విద్య, ఉద్యోగ, భవిష్యత్‌పై ప్రభా వం చూపుతుందని తెలిపారు. ఎవరైనా ర్యా గింగ్‌కు గురైతే వెంటనే ప్రిన్సిపాల్‌ లేదా డయ ల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు.

ఉద్యోగం రాలేదని

యువకుడి బలవన్మరణం

బెజ్జంకి(సిద్దిపేట): ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండ లంలోని గుగ్గిల్లలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సౌజన్య కథనం మేరకు... గ్రామానికి చెందిన బాణాల స్వామికి కుమారుడు, కుమార్తెలున్నా రు. అతను డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు రఘు(22) హైదరాబాద్‌లో ఐటీఐ పూర్తి చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో ఇటీవల ఇంటికి వచ్చాడు. ఈనెల 21న వ్యవసాయ బావి వద్ద క్రిమిసంహారక మందు తాగి తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.

మొక్కజొన్నపై అడవి పందుల దాడి  1
1/2

మొక్కజొన్నపై అడవి పందుల దాడి

మొక్కజొన్నపై అడవి పందుల దాడి  2
2/2

మొక్కజొన్నపై అడవి పందుల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement