
డెంగీతో ఇంటర్ విద్యార్థి మృతి
జగదేవ్‌పూర్(గజ్వేల్): డెంగీ జ్వరంతో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తిమ్మాపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నాయిని మహేందర్–పోచమ్మ దంపతుల కుమారుడు శ్రావణ్(17) గజ్వేల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం శ్రావణ్‌కు జ్వరం రావడంతో గ్రామంలోని ఓ ప్రైవేటు క్లినిక్‌లో చికిత్స చేయించుకున్నాడు. జ్వరం ఎక్కువ అవడంతో శుక్రవారం రాత్రి గజ్వేల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో కొంపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ జ్వరంగా గుర్తించారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు.