
మరో నాలుగేళ్లు బీమా ధీమా
వివరాలు 8లో
సృష్టిలో మనిషికి మనిషే తోడు. సేవాభావంలోను సాయపడటంలోనే మానవత్వం పరిమళిస్తుంటుంది. సేవ, సాయమే పరమావధిగా పనిచేసే మనుషులందరూ ఒకే చోట ఉంటూ పొరుగువారి సమస్యను తమదిగా భావించి పరిష్కరిస్తున్నారు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీ వాసులు. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్న గురజాడ పలుకుల్ని ఆదర్శంగా తీసుకున్నారేమో వీరంతా. ఎక్కడెక్కడి వారో ఇక్కడకు చేరి సేవలోనూ, సాయమందించడంలోనూ తమ ఉదారతను దాతృత్వాన్ని చాటుకుంటూ ఏకత్వంలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్న ఈ ‘గ్రేటెడ్’కమ్యూనిటీ వాసులపై ‘సాక్షి’సండే స్పెషల్.
● మహిళా సంఘాల బీమా పథకం పొడిగింపు ● జిల్లావ్యాప్తంగా 106 మందికి బీమా పథకం
సంగారెడ్డి టౌన్: మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల రుణాలను అందజేస్తుంది. గ్రామంలోని మహిళలు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించేందుకు సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ ద్వారా వివిధ రూపాలలో మహిళా సంఘాలకు ప్రభుత్వం రుణాలనిస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటిమందిని కోటీశ్వరులుగా మార్చేందుకు కృషి చేస్తోంది. మహిళా సంఘాల సభ్యులకు ఇంత జేస్తున్న ప్రభుత్వం గతేడాది నుంచి బీమా పథకాన్ని కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళా సంఘాల్లోని సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తూ మృతి చెందితే ఉచిత బీమా సదుపాయం కింద రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తోంది. అయితే ఈ ఉచిత బీమా పథకాన్ని ప్రభుత్వం తాజాగా మరో నాలుగేళ్లు వరకు పొడిగించింది. దీంతోపాటు రుణబీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకమూ ఉచితమే. లోన్ బీమా పథకంలో సీ్త్రనిధి నుంచి రుణాలు పొందిన వారు ఏ కారణం చేతనైనా చనిపోతే వారు తీసుకున్న దాంట్లో గరిష్ఠంగా రూ.2 లక్షలు మాఫీ చేసేవారు.
ఇదివరకు బీమా సంస్థ..
ఇప్పుడు ప్రభుత్వమే
మహిళా సంఘాల్లో సభ్యులెవరైనా ప్రమాదవశాత్తూ చనిపోతే బీమా కంపెనీ రూ.10 లక్షల పరిహారం చెల్లించేది. ఇప్పుడు బీమా కంపెనీ నుంచి కాకుండా ప్రభుత్వమే రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తుంది. ఇది మహిళలకు ఎంతో ఉపయోగపడనుంది. జిల్లావ్యాప్తంగా 695 గ్రామ, 25 మండలాల్లో ఉన్న సంఘాల్లో 1.96 లక్షలమంది సభ్యులున్నారు. జిల్లాలో 106 మందికి రుణ బీమా ద్వారా రూ.99.45 లక్షలను అందజేశారు. ప్రమాద బీమా ద్వారా ఐదుగురికి రూ.50 లక్షలు అందజేశారు.
సభ్వత్వం ఉంటే ప్రమాద బీమా
ప్రమాద బీమా పథకానికి సభ్యులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. సంఘంలో సభ్యురాలైతే చాలు ఈ పథకం వర్తిస్తుంది. పరిహారం కింద వచ్చిన మొత్తాన్ని సభ్యు రాలి నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
పనుల జాతర తీరిలా..
సంగారెడ్డి జిల్లాలో ఈసారి రూ.19.59 కోట్ల వ్యయంతో 2,451 పనులను ప్రాఽరంభించారు. ఇందులో 62 అంగన్‌వాడీ, 27 గ్రామ పంచాయతీ భవనాలు ఉండగా మిగిలిన పశువుల పాకలు, గొర్రెల షెడ్లు వంటి వ్యక్తిగత పనులున్నాయి.
మెదక్ జిల్లాలో రూ.20.66 కోట్లతో 3,238 పనులను చేపట్టారు. ఇందులో 37 అంగన్‌వాడీ, 33 గ్రామపంచాయతీ భవనాలున్నాయి. మిగిలిన వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చే పనులను ఎంపిక చేశారు.
సిద్దిపేట జిల్లాలో 496 గ్రామపంచాయతీల్లో రూ.12.85 కోట్లతో 536 పనులను చేపట్టారు. ఇందులో అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ భవనాలు సుమారు 20 వరకు ఉంటాయి.
అవగాహన కల్పిస్తున్నాం
మహిళా సంఘంలోని సభ్యులకు బీమా పథకంపై అవగాహన కల్పిస్తున్నాము. సంఘంలోని సభ్యులకు బీమా వెంటనే అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు సీ్త్ర నిధి ద్వారా రుణాలను అందజేస్తున్నాం.
–శ్రీనాథ్, సీ్త్రనిధి బ్యాంక్ రీజినల్ మేనేజర్

మరో నాలుగేళ్లు బీమా ధీమా