
మంత్రులకు బ్రహ్మోత్సవాల ఆహ్వానం
పటాన్‌చెరు: వినాయక చవితి పురస్కరించుకుని ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గణేశ్‌గడ్డ దేవస్థానంలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో కొండా సురేఖ, వివేక్, రఘునందన్‌రావుకు వారి వారి నివాసంలో దేవస్థానం ఈఓ లావణ్య, ఆలయ ధర్మకర్తలు, అర్చకులతో శనివారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ లావణ్య మాట్లాడుతూ...ప్రతీ సంవత్సరం వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆహ్వాన పత్రికను అందజేసిన వారిలో మాజీ సర్పంచులు సుధీర్ రెడ్డి, వెంకన్న, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.