ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వివాహపత్రిక అందజేత | - | Sakshi
Sakshi News home page

ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వివాహపత్రిక అందజేత

Mar 13 2025 2:36 PM | Updated on Mar 13 2025 2:35 PM

పటాన్‌చెరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తన సోదరుడి కుమారుడు సంతోష్‌రెడ్డి వివాహానికి హాజరుకావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం విజయవాడ తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. మహిపాల్‌రెడ్డి వెంట సీనియర్‌ నాయకులు వెంకటరెడ్డి, సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.

బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ రంగంపై ఉచిత శిక్షణ

15 నుంచి దరఖాస్తుల స్వీకరణ

టీజీబీసీ స్టడీ సర్కిల్‌ జిల్లా డైరెక్టర్‌ దయాసాగర్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ రంగంపై నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు టీజీబీసీ స్టడీ సర్కిల్‌ సిద్దిపేట డైరెక్టర్‌ కృష్ణ దయాసాగర్‌ బుధవారం తెలిపారు. ఈ శిక్షణ హైద్రాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ ట్రైనింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పూర్తయి, 26 ఏళ్లు లోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు 15 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్‌ 12 నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రంలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు టీజీబీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

లేఖా రచన పోటీల్లో ప్రతిభ

జాతీయస్థాయిలో

ఉపాధ్యాయుడికి బహుమతి

తూప్రాన్‌: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్‌ నెలలో నిర్వహించిన ఉత్తరాల రచన పోటీల్లో వజ్జ రాజేశ్వర్‌కు జాతీయ స్థాయి (తెలంగాణ సర్కిల్‌) తృతీయ బహుమతి దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని తపాలా శాఖ అధికారులు బుధవారం తెలిపారన్నారు. ‘డిజిటల్‌ యుగంలో ఉత్తరాల ప్రాముఖ్యత’ అనే అంశంపై తపాలా శాఖ లేఖా రచన పోటీ నిర్వహించినట్లు తెలిపారు. బహుమతి కింది రూ.5,000 నగదుతోపాటు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నుంచి ధ్రువపత్రం అందజేయనున్నారని తెలిపారు. ప్రస్తుతం రాజేశ్వర్‌ పట్టణంలోని గీతా స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ పీ.రామాంజనేయులు, చైర్‌ పర్సన్‌ ఉష, ప్రిన్సిపాల్‌ వెంకటకృష్ణ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

వ్యక్తి అదృశ్యం

జిన్నారం (పటాన్‌చెరు): మతి స్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైన బొల్లారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవీందర్‌ రెడ్డి కథనం మేరకు.. మాదారం గ్రామంలో నివాసముండే దూదేకుల మొగులం సాబ్‌ (69) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. 9న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కొడకంచి వైపుగా వెళ్లినట్లు స్థానికులు కుటుంబీకులకు తెలిపారు. కొడకంచి పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మొగులం కుమారుడు దావుద్‌ ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

సంగారెడ్డి రూరల్‌: బెస్ట్‌ అవైల్డ్‌ ఏబుల్‌ స్కూల్స్‌లో పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ సంగారెడ్డి, పేరెంట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలోని పరిపాలన అధికారి పరమేష్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. శ్రీధర్‌ మహేంద్ర మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపిక చేసిన బెస్ట్‌ అవైల్డ్‌ ఏబుల్‌ స్కూల్స్‌లకు ప్రభుత్వం నుంచి గత కొన్ని నెలలుగా రావాల్సిన పెండింగ్‌ బిల్లుల రాకపోవటంతో సంబంధించిన స్కూల్‌ల యాజమాన్యలు, విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు, దుస్తులు, మెనూ ప్రకారం, ఆహారం అందిచడం లేదని దీని వల్ల విద్యార్థులకు మెరుగైన సౌకర్యలు అందటం లేదని విద్యార్థుల తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం బెస్ట్‌ అవైల్డ్‌ ఏబుల్‌ స్కూల్స్‌ల పెండింగ్‌ బిల్లులు మంజూరు చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పేరెంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు రాజు, ఫోరమ్‌ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్‌కుమార్‌, సహకార్యదర్శి పాండు రంగం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వివాహపత్రిక అందజేత1
1/3

ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వివాహపత్రిక అందజేత

ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వివాహపత్రిక అందజేత2
2/3

ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వివాహపత్రిక అందజేత

ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వివాహపత్రిక అందజేత3
3/3

ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వివాహపత్రిక అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement