
పశువుల అక్రమ రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు
సిద్దిపేట సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లా సరిహద్దులలో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశువుల రవాణా విషయంలో వెటర్నరీ వైద్యుల నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు నిరంతరం పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయన్నారు. పశు సంవర్థక శాఖ సిబ్బందితో షిఫ్ట్‌ల వారీగా సమన్వయంతో విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చట్ట విరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆమె ఆదేశించారు.
తప్పిపోయిన మహిళ
మృతదేహమై లభ్యం
చిన్నశంకరంపేట(మెదక్): రెండు నెలల కిందట తప్పిపోయిన మహిళ అడవిలో అస్థి పంజరమై కనిపించిన ఘటన చిన్నశంకరంపేట మండలం సూరారం అటవీ ప్రాంతంలో మంగళవారం వెలుగు చూసి ంది. పేట ఎస్‌ఐ నారాయణగౌడ్ కథనం మేరకు.. నిజా ంపేట మండలంలోని రజాక్‌పల్లి గ్రామానికి చెందిన వజ్జె బాల మల్లవ్వ(54) మార్చి 13న మండలంలోని భగీరథపల్లిలోని బీరప్ప జాతరకొచ్చి తప్పిపోయింది. మహిళ మానసిక స్థితి బాగా లేకపోవడంతో ఎక్కడికో వెళ్లిపోయింది. మరుసటి రోజు 14న బాధితురాలి కుమారుడు వజ్జె శ్రీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. మంగళవారం సూరా రం అటవీ ప్రాంతంలో మానుకుంట బండ రాళ్ల వద్ద కుళ్లిపోయిన మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి పరిశీలించి మల్లవ్వగా గుర్తించారు. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆల్ఫాజోలమ్ పట్టివేత
వర్గల్(గజ్వేల్): వర్గల్ మండలం నెంటూరులో ఓ ఇంటిపై మంగళవారం జిల్లా ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేశారు. సోదాలో 330 గ్రాముల ఆల్ఫాజోలమ్ దొరికినట్లు ఎకై ్సజ్ అధికారులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ఎకై ్సజ్ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు, సీఐలు కే.శ్రీధర్, బ్రహ్మానంద రెడ్డి, ఎస్‌ఐలు సాయికృష్ణ, శ్రీనివాస్, హెచ్‌సీలతో కూడిన బృందం నెంటూరులోని గౌరయ్యగారి ప్రకాశ్‌గౌడ్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.3,30,000 విలువైన చేసే 330 గ్రాముల ఆల్ఫాజోలమ్ దొరికింది. ప్రకాశ్‌గౌడ్‌ను విచారించగా దానిని రాయపోలు మండలానికి చెందిన కొత్తపల్లి సత్యనారాయణ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఆల్ఫాజోలమ్‌ను సీజ్ చేశామని, ప్రకాశ్‌గౌడ్‌తోపాటు సత్యనారాయణను అరెస్ట్ చేసి కరీంనగర్ జైలుకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.