
మద్యం లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా
డ్రైవర్ మృతి
హత్నూర(సంగారెడ్డి): బీర్ కాటన్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన హత్నూర మండలం చందాపూర్ బస్‌స్టేజి సమీపంలో సంగారెడ్డి–నర్సాపూర్ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పుల్కల్ మండలం శివ్వంపేట గ్రామ శివారులోని బీర్ ఫ్యాక్టరీ నుంచి బీర్ కాటన్ల లోడుతో కరీంనగర్ లిక్కర్ డిపోకు డీసీఎం వెళ్తుంది. డీసీఎం ఒక్కసారిగా చందాపూర్ గేటు సమీపంలోని వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రవీణ్(22) మృతి చెందగా క్లీనర్ ముజామిద్ ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితులు ఇద్దరూ కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా చింతకి గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. విషయాన్ని తెలుసుకున్న ఎకై ్సజ్ ఎస్‌ఐ సందీప్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లను పరిశీలించి పంచనామ నిర్వహించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డివైడర్‌ను ఢీకొని కంటైనర్
హుస్నాబాద్: డివైడర్‌ను ఢీకొని కంటైనర్ బోల్తా పడిన ఘటన హుస్నాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి జిల్లా పరకాల నుంచి సంగారెడ్డి పేపర్ మిల్లుకు బుధవారం అర్థరాత్రి ఇసుక కంటైనర్ వెళ్తుంది. మార్గమధ్యలో హుస్నాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. డోర్ అద్దాలు పగులగొట్టుకొని డ్రైవర్, క్లీనర్ బయటకు దూకారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

మద్యం లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా