
ఆటోలోనే డ్రైవర్ మృతి
రామాయంపేట(మెదక్): ఆటోలో నిద్రించిన డ్రైవర్ అందులోనే మృత్యువాత పడ్డ ఘటన మంగళవారం రామాయంపేటలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌కు చెందిన ప్రవీణ్‌గౌడ్ (35) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం సాయంత్రం ఆటోలో రామాయంపేటకు వచ్చిన ప్రవీణ్‌గౌడ్ ఎల్లమ్మ గుడి వద్ద బండి నిలిపి అందులోనే నిద్రించాడు. ఉదయం చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య అఖిలతోపాటు ఐదేళ్ల కుమారుడు ఉన్నారు.