
దేశాన్ని కాపాడుకోవాల్సింది యువతనే
సిద్దిపేటకమాన్: పదేళ్ల కాలంలో దేశం మేకిన్ ఇండియా పేరిట గుండు సూది నుంచి ఫిరంగి వరకు మనమే తయారు చేసుకున్నామని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి లాల్ కమాన్ వరకు జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఫహల్గాం దాడిలో అమరులైన వారిని, యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్‌లను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ప్రపంచం మన శక్తి గురించి ఆలోచన చేస్తుందన్నారు. ఆడబిడ్డల సింధూరాన్ని తుడచాలని చూస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్‌ను లేకుండా చేస్తామన్నారు. మన దేశానికి ముప్పు వస్తుందంటే మనం కూడా యూనిఫామ్ లేని సైనికుల వలె సిద్ధం కావా లని పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడాల్సింది యువతనేని అన్నారు. భారత్ మాతకీ జై అంటూ జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
ఐటీఐ కళాశాల భవనం పరిశీలన
దుబ్బాక : అభివృద్ధి పనులు ఏళ్లుగా నత్తనడకన సాగడంపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం దుబ్బాక పట్టణంలోని ఐటీఐ కళాశాల భవనం నిర్మాణం పనులను పరిశీలించారు. ఏడేళ్ల కిందట ప్రారంభమైన ఐటీఐ కళాశాల భవనం నిర్మాణం ఇంకా అసంపూర్తిగా ఉండటంతో విచారం వ్యక్తం చేశారు. పూర్తి కావడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజల సంక్షేమం కోసం పని చేయాలన్నారు. అనంతరం పలు శుభకార్యాల్లో పాల్గొనడంతోపాటు బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సుభాష్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, ప్రవీణ్ కుమార్, వెంకట్ గౌడ్, భాస్కర్, బాచీ, తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
సిద్దిపేట పట్టణంలో జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ