
జాతీయ స్థాయిలో రాణించాలి
తూప్రాన్: సాఫ్ట్‌బాల్ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్‌రావు అన్నారు. పట్టణ సమీపంలోని బాలుర గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో జరుగుతున్న 11వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర సాఫ్ట్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. అనంతరం ఆర్డీఓ జయ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో రాణించి విద్య, ఉద్యోగాల్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు, తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అభిషేక్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, తెలంగాణ అసోసియేషన్ కోశాధికారి రేణుక, సంయుక్త కార్యదర్శి రాజేందర్, మెదక్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడిప్యాక నారాయణ గుప్త, ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ శర్మ, కోశాధికారి గోవర్దన్ గౌడ్, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన కార్యదర్శులు నాగిరెడ్డి, గంగా మోహన్, వెంకటేశ్, రాజశేఖర్, క్రీడాకారులు, కోచ్‌లు, మాజీ కౌన్సిలర్ భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం