
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పెద్దాపూర్ గ్రామ శివారులోని ఓ హోటల్‌లో నిర్వహించిన యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశానికి అయన హాజరై, మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవడంలో యువజన కాంగ్రెస్ చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇన్‌చార్జి శ్యాంచరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరేశ్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి నాగార్జున, వివిధ నియోజకవర్గాల, మండలాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.