
మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ
జోగిపేటలో జరిగిన సభకు హాజరైన జనం
వట్‌పల్లి/జోగిపేట (అందోల్): బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఈ మూడు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు. ఆదివారం జోగిపేటలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు ఈ మూడు పార్టీలు చేతులు కలిపాయని, బీజేపీ, బీఆర్‌ఎస్ అరాచకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ గెలిచాక ఢిల్లీలో బీజేపీని కూడా మట్టికరిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎవరితో కలవదని, బీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, రూ.500లకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, పంట పెట్టుబడికి ఎకరానికి రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను అందిస్తామన్నారు. ప్రతి మండలంలో ఓ ఇంటర్నేషల్ స్కూల్‌ను నిర్మించి నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారు.. అసలు కేసీఆర్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాహుల్ కోరారు. సభలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.
ఆ మూడు పార్టీలు ఒక్కటే
బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంల ఓటమే లక్ష్యం
తెలంగాణకు బీఆర్‌ఎస్ ఏం చేసిందో చెప్పాలి
కాంగ్రెస్ విజయభేరి సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ
Comments
Please login to add a commentAdd a comment