సిరాజ్ మృతదేహం
● ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
పటాన్‌చెరు టౌన్: కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్‌పూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన ఎండీ. సిరాజ్ (32) బీరంగూడ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. మంగళవారం స్నేహితులు షబ్బీర్, నజీర్‌తో కలిసి అమీన్‌పూర్ పరిధిలోని జానకంపేట, వడక్‌పల్లిలో మద్యం సేవించాడు. అనంతరం వడక్‌పల్లి సమీపంలో గల నల్ల చెరువులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశా త్తు చెరువులో మునిగి మృతిచెందాడు. స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


