పట్టుబడిన వాహనదారులకు జరిమానా

మంటలను ఆర్పివేస్తున్న స్థానికుడు - Sakshi

పటాన్‌చెరు టౌన్‌: డ్రైంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు కోర్టు జరిమానా విధించింది. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పటాన్‌చెరు ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌ రెడ్డి అన్నారు. బుధ, గురువారాల్లో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో 25 మంది పట్టుబడ్డారు. వారిని శుక్రవారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా జడ్జి 24 మందికి ఒక్కొక్కరికి రూ.2 వేలు, మరో వ్యక్తికి రూ.3 వేల జరిమాన విధించినట్లు పోలీసులు తెలిపారు.

తనిఖీల్లో పట్టుబడిన 13 మందికి..
సిద్దిపేటకమాన్‌: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్‌ చౌరస్తా, ఎంపీడీఓ కార్యాలయ చౌరస్తా, రాజీవ్‌ రహదారిపై సిద్దిపేట ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణ తమ సిబ్బందితో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 13 మంది పట్టుబడ్డారు. వారిని సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా జడ్జి రమేశ్‌బాబు రూ.29,500 జరిమానా విధించారు.

నగల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం
కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): నగల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో నగలతయారీ దుకాణంలో గ్యాస్‌ సిలిండర్‌ లీకై మంటలు చెలరేగాయి. షాపు యాజమాని లక్ష్మీనారాయణ శుక్రవారం బంగారు ఆభరణాలు తయారు చేస్తుండగా దుకాణంలోని గ్యాస్‌ సిలిండర్‌ లీకై మంటలు చెలారేగాయి. దీంతో స్థానికుల సహకారంతో మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పిలుచ్చుకున్నారు.

బైక్‌ చోరీ
జహీరాబాద్‌ టౌన్‌: పట్టణంలోని సాయిరాం నగర్‌లో కాలనీలో మోటారు బైక్‌ను చోరీ చేశారు. సాయిరాం నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న సుదర్శన్‌ ఏపీ28 డీఆర్‌8838 నంబర్‌ గల హీరో గ్లామర్‌ మోటారు బైక్‌ ఇంటి ముందు పార్క్‌ చేశాడు. శుక్రవారం లేచి చూసేసరికి బైక్‌ కనిపించలేదు. దీంతో బాధితుడు సుదర్శన్‌ జహీరాబాద్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్ట్‌
నర్సాపూర్‌: నర్సాపూర్‌లోని ఓ ఏటీఎంలో చోరీ చేసేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు. పట్టణంలోని బస్టాండ్‌లోని ఏటీఎంలో గురువారం రాత్రి చోరీ చేసేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా విచారణ చేయగా మండలంలోని పెద్దమ్మ తండాకు చెందిన భాస్కర్‌ ఏటీఎంలో చోరీకి యత్నించినట్లు రుజువుకావడంతో శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top